కడప స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓర్ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్ఎండీసీ ఒప్పందం

  • కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
  • త్వరలో శంకుస్థాపన
  • ఎన్ఎండీసీతో ఒప్పందం చారిత్రాత్మకమన్న సీఎం జగన్
త్వరలోనే కడప స్టీల్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. ఈ క్రమంలో ఓ కీలక ఒప్పందం కుదిరింది. కడప స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓర్ ను సరఫరా చేసేందుకు ఎన్ఎండీసీ ముందుకువచ్చింది. ఈ మేరకు సీఎం జగన్ సమక్షంలో ఎన్ఎండీసీ వర్గాలు, ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ యాజమాన్యం మధ్య అవగాహన ఒప్పందం ఖరారైంది. ఈ సమావేశంలో ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా కూడా పాల్గొన్నారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ, ఇది చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం అని అన్నారు.
Go Back to Shorts
Kadapa
Steel Plant
Jagan
NMDC
Roja
APIIC

More Telugu News